
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
నరసరావుపేట: ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ సహకార ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఫణి పేర్రాజు కోరారు. గురువారం ప్రకాష్‌నగర్‌లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) సమావేశం హాలులో ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ముఖ్య సమావేశం రిటైర్డు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జేపీడీ తాండల్ కాండం అధ్యక్షతన నిర్వహించారు. ఫణి పేర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 230 మంది సహకార శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల నుంచి శాఖలో ప్రమోషన్లు లేవని గుర్తుచేశారు. ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళుతున్నామని తెలిపారు. జేపీడీ తాండల్ కాండం మాట్లాడుతూ సహకార సంఘాల కంప్యూటరైజేషన్ పూర్తయ్యే దశలో ఉందని, ఇప్పుడు ఈ పాక్స్ కంప్యూటర్ ఆడిట్ కొత్త కావడం, సమయాభావం వలన ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్నారని విన్నవించారు. ఆత్మీయ అతిథిగా జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి స్వర్ణ చినరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎంపిక
జిల్లా అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా డి.రవికుమార్, ఉపాధ్యక్షులుగా కె.అంజమ్మ, కోశాధికారిగా వి.అశోక్ కుమార్, ఈసీ మెంబర్‌గా ఎం.రమేష్‌లను కో ఆప్షన్ పద్ధతిలో ఎంపిక చేసుకొని నియమించినట్లు జిల్లా కార్యదర్శి జి.సురేష్‌నాయుడు పేర్కొన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్.లక్ష్మీబాయి, ఉద్యోగ సంఘాల నాయకులు కె.శ్రీనివాసరావు, ఏవీఎస్ సాయిరాం, పరిమళ, రాధ, పద్మావతి, హనుమంతరావు, జిల్లా కోశాధికారి ఏంవీ నరసయ్య పాల్గొన్నారు.