
విద్యాశాఖ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్లు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సమయంలో విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కళాశాలల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోని వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ బకాయిలు పేరుకపోతున్నాయే తప్పా నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజు బకాయిల పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు జగదీష్, మధు, హేమంత్, ఆర్.అంజిరెడ్డి, యు.రాజు పాల్గొన్నారు. తొలుత అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా