
ఏపీఆర్‌ఎస్‌ఏ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ
గుంటూరు వెస్ట్: ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర స్థాయి క్రీడా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అనంతపురంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్–2025లో జరుగుతుందన్నారు. దీనిలో జిల్లా నుంచి 55 మంది పాల్గొంటారని తెలిపారు. జేసీకి పుష్పగుచ్ఛ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ప్రధాన కార్యదర్శి వెంకటరావు, రాష్ట్ర కార్యదర్శి దివ్య, షేక్ దరియా వలి ఈఖీ, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అనుపమ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయూబ్, ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యదర్శి రామారావు, బాబురావు, లీల, సంధ్యారాణి, త్రిలోక తదితరులు పాల్గొన్నారు.