
జర్నలిస్ట్ కలం ఒక ఆయుధం
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
ఇటీవల సాక్షిలో రెండు అంశాలపై వచ్చిన వార్తల విషయంలో పోలీసులు విజయవాడలోని సాక్షి కార్యాలయానికి వెళ్లి ఎడిటర్‌కు నోటీసులు జారీ చేయడం పాత్రికేయ స్వాతంత్య్రానికి విఘాతం కలిగించడమే. సత్యమనే సూర్యునికి చెయ్యి అడ్డం పెట్టి ఆపడం వంటిది. ఆ వార్తని ఖండిస్తూ ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలే తప్పా పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరచకూడదు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం ముమ్మాటికీ గర్హనీయం. –ఈదర గోపీచంద్, నైతిక విప్లవం పత్రిక పూర్వ సంపాదకులు, నరసరావుపేట
ఎడిటర్‌పై కేసు ఉపసంహరించాలి
ఓ రాజకీయ పార్టీ నేత మాట్లాడిన మాటలను స్థానిక విలేకరి ద్వారా పంపబడిన సమాచారం మేరకు ప్రచురించినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌పై కేసు నమోదుచేయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నేనెక్కడా వినలేదు. ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తున్న సాక్షి పేపర్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగినట్లుగా కన్పిస్తోంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. గతంలో కూడా ఎడిటర్‌పై కేసు నమోదు చేసినట్లుగా విన్నాం. బేషరతుగా పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఉపసంహరించుకొని చంద్రబాబు తన సీనియార్టీని కాపాడుకోవాలి. – వై.వెంకటేశ్వరరావు, పీడీఎం రాష్ట్ర నాయకులు