
జాబ్ క్యాలెండర్‌పై మాట మార్చిన కూటమి ప్రభుత్వం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
మంగళగిరి టౌన్: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై మాట మార్చిందని, తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి న తరువాత నిరుద్యోగులను పూర్తి మోసం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ గా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తా మని హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ నిరుద్యోగ భృతిపై ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకు లు సామ్యేలు, ఫిరోజ్, గోపిరాజు, నరేంద్ర, జాలా ది నవీన్, ప్రవీణ్ పాల్గొన్నారు.