
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధ్యక్షులుగా కొమ్ము చంద్రశేఖర్‌బాబు (మాచర్ల), ఉపాధ్యక్షులుగా పెద్దింటి నాగేశ్వరరావు (సత్తెనపల్లి), దావలి పెదవెంకటేశ్వర్లు (పెదకూరపాడు), ప్రధాన కార్యదర్శులుగా పులిమెల మాణిక్యం (మాచర్ల), సాతులూరి రమేష్ (గురజాల), బేతం గాబ్రియేలు(వినుకొండ), పంగులూరి విజయకుమార్ (నరసరావుపేట), పండుల బుల్లెబ్బాయ్ (చిలకలూరిపేట), కార్యదర్శులుగా తంబాటి మల్లయ్య (మాచర్ల), కాలే మాణిక్యాలరావు (గురజాల), కొచ్చర్ల రాజారత్నం (చిలకలూరిపేట), కిన్నెర దేవయ్య (వినుకొండ), నేలటూరి సురేష్ (నరసరావుపేట), యనమల సింగయ్య (సత్తెనపల్లి), కంభంపాటి భాస్కరరావు (మాచర్ల)లను నియమించారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా తంగిరాల మేరిబాబు, బత్తుల సాగర్‌బాబు (మాచర్ల), పల్లమిశాల కిషోర్, కోట వెంకటరావు(వినుకొండ), బందెల వెంకటరావు, చింతిరాల నాగార్జున నటరాజ్ (నరసరావుపేట), ప్రత్తిపాటి కోటేశ్వరరావు, దేపంగి మరియబాబు (సత్తెనపల్లి), తుమ్మలగుంట రమేష్‌బాబు, యామర్తి రవి (చిలకలూరిపేట), మందడపు నాగయ్య, చిలకల శ్రీకాంత్, కంపెర్ల రోశయ్య (పెదకూరపాడు), చల్లగుండ్ల స్వామి, బండ్ల ఏసుపాదం (గురజాల) నియమితులయ్యారు.