● నేటి నుంచి 14వ తేదీ వరకు
దరఖాస్తుల స్వీకరణ
● 15న లాటరీ ద్వారా ఎంపిక
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో మిగిలిన 30 బార్ అండ్ రెస్టారెంట్‌లకు తిరిగి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.మణికంఠ గురువారం తెలిపారు. జిల్లాలో 54 బార్ అండ్ రెస్టారెంట్‌లకు గాను మొదటి విడత 24 బార్‌లకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరిగాయన్నారు. మిగిలిన 30 బార్‌లకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రీనోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. నరసరావుపేటలో 8, చిలకలూరిపేటలో 7, పిడుగురాళ్లలో 6, మాచర్ల 3, వినుకొండలో 6 నూతన బార్ అండ్ రెస్టారెంట్‌లకు శుక్రవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈనెల 15వ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామని తెలిపారు.
నరసరావుపేట: జిల్లాలో యూరియా సరఫరా మెరుగుపర్చేందుకు వ్యవసాయశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గురువారం పేర్కొన్నారు. యూరియా సరఫరాలో సమస్యలు, అక్రమాలను 83320 66633 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
నరసరావుపేట రూరల్: చంద్రగహణాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 8వ తేదీ ఉదయం ఏడు గంటల వరకు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు ఆలయ ఈవో టి.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 8 గంటల నుంచి స్వామి వారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తామని తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు దర్శన వేళల్లో మార్పులను గమనించాలని కోరారు.
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం 7,427 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కు 296, బ్యాంక్ కెనాల్ 1,848, తూర్పు కాలువకు 699, పశ్చిమ కాలువకు 267, నిజాంపట్నం కాలువకు 500, కొమ్మూరు కాలువకు 3,080 క్యూసెక్కులు విడుదల చేశారు. సముద్రంలోకి 18,125 క్యూసెక్కులు వదులుతున్నారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి నిలువ నీడ కల్పించారు. స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 75 వేల మందికి స్థలాలు కేటాయించారు. ఇందులో కొంత మందికి ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు.అయితే, వాటిని పూర్తి స్థాయిలో అధికారులు పంపిణీ చేయకపోవడంతో సచివాలయాల్లోనే మూలుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నగర పరిధిలోని 127వ వార్డు సచివాలయంలో బుధవారం పాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో సదరం సర్టిఫికెట్ జారీ చేయడంపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, సచివాలయ సెక్రటరీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో సచివాలయాల్లో ఉన్న పాత సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్‌ను నగరపాలక సంస్థకు అందజేయాలని ఆదేశించడంతో గోతాల్లో వేల సంఖ్యలో రిజిస్టర్ ఇళ్ల పట్టాల డాక్యుమెంట్స్ దర్శనమియ్యాయి.
బార్‌లకు రీ నోటిఫికేషన్