
తెలుగు భాషపై శివకుమారికి పట్టు
డీఎస్సీ–1996 ద్వారా తెలుగు ఉపాధ్యాయినిగా ఎంపికైన బి.శివ కుమారి కనపర్రు పాఠశాలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేసానుపల్లి, కండ్లకుంట, తుమ్మలచెరువు, రెడ్డిపాలెం తదితర పాఠశాలల్లో పనిచేసి 2023లో జరిగిన బదిలీలలో నకరికల్లు జెడ్పీ హైస్కూల్‌కు వచ్చారు. తెలుగు భాషపై పట్టు, ఆధ్యాత్మిక ప్రసంగాలలో దిట్టగా గుర్తింపు పొందిన శివపార్వతి ఎన్నో ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ పాఠశాలకు హాజరై విద్యార్థులకు ప్రత్యేక బోధనా పరికరాల ద్వారా బోధన అందిస్తుంటారు. ప్రత్యేకించి పాఠశాలలోని గ్రంథాలయాన్ని తాను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించటం తన పాఠశాల దినచర్యలో ఒక భాగంగా మార్చుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయినిగా తాను దరఖాస్తు చేయలేదని రాష్ట్ర పాఠశాల విద్య కార్యాలయం తనను ఎంపిక చేసినట్టు తెలిపారు.