అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి | - | Sakshi
Sakshi News home page

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి

Sep 4 2025 5:57 AM | Updated on Sep 4 2025 5:57 AM

అమృతల

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి

వాహనాన్ని దహనం చేసిన దుండగులు

తెనాలి అర్బన్‌: వేమూరు నియోజకవర్గ పరిధిలోని అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలిపే విధంగా చూడాలని ఆ ప్రాంత వాసులు కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మంగళవారం తెనాలిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జగదీష్‌ ప్రసాద్‌, గోగినేని వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్‌, గోపీచంద్‌, రాజేంద్ర, కోగంటి సాంబశివరావు పాల్గొన్నారు.

కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

నకరికల్లు: మతిస్థిమితం సక్రమంగా లేక వృద్ధురాలు ఎన్‌ఎస్‌పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ చల్లా సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చీమలమర్రి గ్రామానికి చెందిన సురభి సీతమ్మ(75) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో చల్లగుండ్ల సమీపంలోని గోరంట్ల మేజర్‌లో దూకింది. సమీపంలోని వారు గమనించి వెలికితీసే సరికే మృతిచెందింది. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ఆరుగురు పిల్లలు ఉండగా వారందరూ వివాహితులే.

14 యూరియా బస్తాలు స్వాధీనం

దాచేపల్లి: అక్రమంగా తరలిస్తున్న 14 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సౌందర్యరాజన్‌ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, ఈ తనిఖీల్లో గురజాల మండలం గంగవరం గ్రామం నుంచి 14 యూరియా బస్తాలను రైతులు పేరుమీద కొనుగోలు చేసి తెలంగాణలోని దామరచర్ల మండలంలోకి ఆటో ద్వారా అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని గుర్తించి యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూరియాను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సౌందర్యరాజన్‌ వెల్లడించారు.

కొల్లూరు : గుర్తు తెలియని దుండగులు టీడీపీ నాయకుడి వాహనాన్ని దగ్ధం చేసి న సంఘటన కొల్లూరులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. కొల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు బుర్రి జగజ్జీవనరావు వాటర్‌ ప్లాంట్‌ నడుపుతారు. స్థానిక దక్షిణపు వీధిలోని పాడి తోటల ప్రాంతంలో మంగళవారం రాత్రి వాటర్‌ ప్లాంట్‌ వద్ద రోడ్డు వెంబడి వాహనాన్ని నిలిపి వెళ్లారు. తెల్లవారుజాము ప్రాంతంలో అది దగ్ధమవుతుండటంతో స్థానికులు గమనించి వాహన యజమానికి సమాచారం అందించారు. పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో అప్పటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికుల సహకారంతో అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని దగ్ధం చేసినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దీని వెనుక టీడీపీలో వర్గ విభేదాలు కారణమవ్వవచ్చునన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

బైక్‌ ప్రమాదంలో ఎంపీడీఓకు గాయాలు

ఇంకొల్లు (చినగంజాం): విధుల్లో భాగంగా ఇంకొల్లు ఎంపీడీఓ జి. శ్రీనివాసరావు బుధవారం అక్కడ నుంచి దుద్దుకూరు గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కొణికి, దుద్దుకూరు గ్రామాల మధ్య ఎదురుగా వాహనం రావడంతో దాన్ని తప్పించుకునే క్రమంలో హ్యాండిల్‌ కొద్దిగా పక్కకు తిప్పడంతో ఎదురుగా గుంతలో పడిపోయింది. వాహనాన్ని నడుపుతున్న ఎంపీడీఓ శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకొల్లులో ప్రథమ చికిత్స అనంతరం కార్యాలయానికి వచ్చిన ఆయన్ను తహసీల్దార్‌ ఏవీఎస్‌ శ్రీనివాసరావు, సర్వేయర్‌ ఎం. సాంబశివరావు, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ కిరణ్‌, కార్యాలయ సిబ్బంది పరామర్శించారు.

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి 1
1/3

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి 2
2/3

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి 3
3/3

అమృతలూరు మండలాన్ని గుంటూరు జిల్లాలో కలపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement