
టిష్యూ కల్చర్ అరటికి సబ్సిడీ
కొల్లూరు : టిష్యూ కల్చర్ అరటి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని మండల ఉద్యాన శాఖాధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. మండలంలోని జువ్వలపాలెం, కిష్కింధపాలెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పంటలకు చీడ, పీడలు ఆశించకుండా అధికారుల సూచనల మేరకు మందులు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఏఓ వి.నరేంద్రబాబు మాట్లాడుతూ సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రాల్లో ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బి.ఎన్. వంశీ, వీహెచ్‌ఏ ఎం. నవీన్, వీఏఏలు కె. విజయ్‌కుమార్ పాల్గొన్నారు.