
జాతీయ నేతల విగ్రహాలకు సముచిత గౌరవం
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల( జమునా స్కూల్)లో జాతీయ నాయకుల విగ్రహాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూలన పడిఉన్న వాటిని పాఠశాలలో తిరిగి ఏర్పాటు చేశారు. పునర్నిర్మాణంలో భాగంగా పాఠశాలలోని జాతీయ నాయకుల విగ్రహాలను పిచ్చి మొక్కల మధ్య పడేశారు. దీనిపై ఆగస్టు 15వ తేదీన ‘మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా!’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి, పిడుగురాళ్ల ఎంఈఓ శ్రీనివాసరెడ్డికి ఆదేశాలు జారీచేయడంతో జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు విగ్రహాలను పాఠశాలలో చక్కటి వేదిక ఏర్పాటు చేయించి, పునర్నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు ‘సాక్షి’ చొరవతో జాతీయ నాయకుల విగ్రహాలకు సముచిత గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

జాతీయ నేతల విగ్రహాలకు సముచిత గౌరవం