
మహాత్ములారా.. మన్నించండి!
దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు శ్రమించి, ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన, పీడిత వర్గాలకోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు వారు.. అటువంటి గొప్పవారి చిత్రపటాలకు ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా, ఓ మూలకు పడేసిన వైనమిది. పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మన్యం వీరుడు అల్లూరి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితర నేతల చిత్రపటాలను చెత్త వలే ఓ మూలన పడేసిన అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయంలో ఇటువంటి ఘటనలు జరిగితే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు. – పెదకూరపాడు