
అతివేగం, నిర్లక్ష్యం వల్లే...
రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు, సమయం, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై శాసీ్త్రయంగా అధ్యయనం చేసి, చర్యలు చేపడుతున్నాం. అతివేగం, మద్యం సేవించడం, జంక్షన్ల వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయి. అటువంటి చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. మైనర్‌లకు వాహనాలు ఇవ్వకుండా, వారికి ప్రమాదాల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలి.
– కంచి శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ, పల్నాడు