
ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జాతీయ క
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని శాంతినిలయం అధినేత, బ్రదర్ నందమూరి క్రిష్టర్ ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. గత శనివారం కోనసీమ జిల్లా తాపేశ్వరంలో జరిగిన జాతీయ స్థాయి పాస్టర్ల సమావేశంలో ఆయనను ఈ ఉన్నత పదవికి ఎన్నుకున్నట్లు తెలిపారు. 17 రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న ఈ ఫెలోషిప్‌లో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న క్రిష్టర్ జాతీయ స్థాయి పదవిని చేపట్టడంపై పల్నాడు జిల్లా పాస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దైవసేవకులు నందమూరి క్రిష్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా క్రైస్తవుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన ఎన్నికతో క్రైస్తవ సమాజం మరింత బలోపేతం అవుతుందని పలువురు పాస్టర్లు, సేవకులు అభిప్రాయపడ్డారు.