
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
నకరికల్లు: పిడుగుపాటుకు గురైన వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన మండలంలోని కుంకలగుంట గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి.. కుంకలగుంట గ్రామానికి చెందిన ఊసా నాగేంద్రబాబు(36) వరి విత్తనాలు చల్లేందుకు గాను కూలి పనులకు వెళ్లాడు. అదే సమయంలో కురుస్తున్న వర్షానికి పిడుగు పడింది. పిడుగుపాటుకు గురైన నాగేంద్రబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బంధువులు హుటాహుటిన నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య శ్రావణి, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.