
యూనిఫాం లేక.. సాధారణ దుస్తులతోనే రాక...
వేసవి సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభించే నాటికి విద్యార్థులందరికీ యూనిఫాంలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో మాత్రం విఫలమైంది. పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌కు విద్యార్థులు సాధారణ దుస్తులతో హాజరయ్యారు. పాఠశాలలో మొత్తం 1225మంది విద్యార్థులు ఉండగా, వీరికి యూనిఫామ్ అందకపోవడంతో వారందరూ సాధారణ దుస్తులతోనే సమావేశానికి హాజరవడం గమనార్హం. తొలుత ఈ పాఠశాలలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు హాజరవుతారని కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. అయితే విద్యార్థులకు యూనిఫామ్ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గైర్హాజరయ్యారని తల్లిదండ్రులు చర్చించుకున్నారు.