
భారీ గాలులు.. వడగండ్ల వాన
యడ్లపాడు: మండలం పరిధిలో బుధవారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు గంట సేపు వీచిన భారీ గాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఈదురు గాలులకు భారీ చెట్లు, కొమ్మలు విరిగి పడ్డాయి. బోయపాలెం నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట మార్గంలో రహదారిపై భారీ చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోయపాలెం నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట, సొలస కోళ్ల ఫారాల వద్ద స్తంభాలపై, తీగలపై చెట్ల కొమ్మలు, ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. మామిడి, బొప్పాయి తోటల్లో కాయలు రాలిపోయాయి. ముగనచెట్లు విరిగిపోయాయి. చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామంలోని వెన్నముద్దల బాలకృష్ణుని ఆలయం వెనుక ఉన్న రెండు పూరిళ్లపై చెట్ల కొమ్మలు పడి కప్పులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచి పోయి పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ అధికారులు బృందాలుగా ఏర్పడి రోడ్లపై, విద్యుత్ తీగలపై పడిన చెట్లను, కొమ్మల్ని తొలగించే చర్యలు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మైదవోలు, చెంఘీజ్‌ఖాన్‌పేట మార్గం గుండా కొండవీడు సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అందించే 11కేవీ విద్యుత్ స్తంభాలు నాలుగు నేలకొరిగాయి. దీంతో వంకాయలపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, చెంఘీజ్‌ఖాన్‌పేట, బున్నినగర్, సొలస, కోట, కొత్తపాలెం, కొండవీడు, సంతపేట గ్రామాల్లో అంధకారం అలుముకుంది.
విద్యుత్ స్తంభాలు నేలకూలి
పలు గ్రామాల్లో అంధకారం

భారీ గాలులు.. వడగండ్ల వాన

భారీ గాలులు.. వడగండ్ల వాన

భారీ గాలులు.. వడగండ్ల వాన