
హైవేపై కంటైనర్ బీభత్సం
యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం శివారులో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చైన్నె నుంచి గుంటూరు వైపు వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ అదుపుతప్పి నేరుగా హైవే సెంట్రల్ డివైడర్‌పై ఎక్కింది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఇనుప స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం ముందు భాగంతోపాటు స్తంభానికి బిగించిన సీసీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భారీ క్రేన్లతో ఇనుప స్తంభాలను తొలగించారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్న సమయం కావడం, వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ అలసట, నిద్ర మత్తే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించినట్లు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.
వాహనంతోపాటు సీసీ కెమెరాలు ధ్వంసం డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే దుర్ఘటన

హైవేపై కంటైనర్ బీభత్సం