మోసపోయాం.. న్యాయం చేయండి
నరసరావుపేట: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిసానంటూ ఓ వ్యక్తి తన వద్ద నుంచి రూ.6లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ నరసరావుపేట పట్టణం కొండలరావుపేటకు చెందిన మల్లికార్జునరావు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీలు తదితర సమస్యలకు సంబంధించి 94 ఫిర్యాదులు స్వీకరించారు.
జిల్లా పోలీసు కార్యాలయ పీజీఆర్‌ఎస్‌కు 94 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ సంతోష్


