అంగన్‌వాడీల వేతనాలు పెంచాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇంతవరకు తమ వేతనాలు పెంచలేదని అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. పాతగుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వేతనాలు పెంచకపోగా ఉద్యోగుల పేరుతో కరెంట్ బిల్లులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్‌లు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్‌వాడీల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై.రమణను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి, ఉపాధ్యక్షులు సుకన్య, ధనలక్ష్మి, హేమలత, రాజకుమారి, శివ పార్వతి తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్‌లకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం
బాపట్లటౌన్: బెట్టింగ్‌లకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్‌లో రోజుకొక రకమైన బెట్టింగ్ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వివిధ ఆఫర్స్‌తో బెట్టింగ్ ఫ్రీ అంటూ యువతను ఆకర్షించి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ఒకసారి ఆడి చూద్దాం అని సరదాగా మొదలుపెట్టి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టతరమైన విషయమన్నారు. ఈ బెట్టింగ్స్‌కి అలవాటు పడ్డ వాళ్లు అప్పుల పాలు కావడమే కాకుండా.. చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ ముఠాలు రేపల్లె, చీరాల, అద్దంకి వంటి మరికొన్ని ప్రదేశాల్లో వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దానికి అనుగుణంగా గతంలో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 39 మంది కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చీరాల–1 టౌన్‌లో రెండు కేసుల్లో 11 మంది, రేపల్లె టౌన్‌లో ము గ్గురు, వేమూరు పోలీస్‌స్టేషన్‌లో ఆరుగురు, కొల్లూరులో ఒకరు, చీరాల టూ టౌన్‌లో ఒక రు, వేటపాలెంలో 9 మంది, అద్దంకిలో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే అవకాశం ఉన్న వారిపై నిఘా ఉంచామన్నారు.
29న బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం
పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం మార్చి 29, 30 తేదీలలో నిర్వహిస్తున్నట్లు దర్గా ఈఓ షేక్ ముక్తార్‌బాషా తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 537వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని సోమవారం ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్ చేతుల మీదుగా పోస్టర్లు ఆవిష్కరించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే చెప్పారు.
● ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ● ఎస్పీ తుషార