బియ్యం లారీ బోల్తా
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నుంచి బెంగుళూరుకు 600 బస్తాల లోడుతో వెళ్తున్న లారీకి ఎదురుగా వాహనం రావడంతో డ్రైవర్ పఠాన్ దస్తగిరి సడన్‌గా బ్రేక్ వేయడం వలన లారీ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ దస్తగిరికి గాయాలు కాగా వెంటనే 108 అంబులెన్స్‌లో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెనాలిఅర్బన్: దళితుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు డిమాండ్ చేశారు. చుండూరు మండలం వలివేరు దళితవాడకు చెందిన పందిపాటి రెడ్డియ్యపై దాడికి నిరసనగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ముందుగా బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
వేమూరు(చుండూరు): వలివేరు గ్రామానికి చెందిన అప్పిరెడ్డి, సందీప్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం ఆనందరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం చుండూరు మండలంలోని వలివేరు గ్రామానికి చెందిన పందిపాటి రెడ్డియ్య ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగం అప్పిరెడ్డి ఇంటి ప్రహారీకి తగిలింది. ఇద్దరు మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పిరెడ్డి, కుమారుడు సందీప్ కోపంతో పందిపాటి రెడ్డియ్యపై శుక్రవారం దాడి చేశాడు. బాధితుడు తెనాలి ప్రభుత్వం వైద్య శాలల్లో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఆసుపత్రి అవుట్ పోలీసులు కేసు చుండూరు పోలీసు స్టేషన్‌కు పంపించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు డివిజన్ పీఆర్‌ఓ వినయ్‌కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ – కాకినాడ టౌన్ (07264), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), సికింద్రాబాద్ – నరసాపూర్ (07239) రైళ్లు జనవరి 9వ తేదీన, వికారాబాద్ – నరసాపూర్ (07211) జనవరి 10న, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07280), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), వికారాబాద్ – నరసాపూర్ (07249) రైళ్లు జనవరి 11న, వికారాబాద్ – నరసాపూర్ (07211), వికారాబాద్–నరసాపూర్(07253) జనవరి 12 వ తేదీన, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261) జనవరి 13న కేటాయించినట్లు తెలిపారు. కాకినాడ టౌన్ – వికారాబాద్( 07263) జనవరి 8న, నరసాపూర్–వికారాబాద్ (07250) జనవరి 9న, కాకినాడ టౌన్ –సికింద్రాబాద్ (07279), కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07262), నరసాపూర్ – వికారాబాద్ (07248) రైలు జనవరి 10న, నరసాపూర్ – వికారాబాద్ (07250) జనవరి 11న, కాకినాడ టౌన్ –వికారాబాద్(07262), నరసాపూర్–వికారాబాద్ (07248) జనవరి 12న, నరసాపూర్–వికారాబాద్ (07257), కాకినాడ టౌన్–వికారాబాద్ (07241) రైలు జనవరి 17న, నరసాపూర్–వికారాబాద్ (07259) రైలు జనవరి 18న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07285) రైలు జనవరి 19న గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఈవ్‌టీజింగ్‌పై 332 మందికి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై అనవసరంగా సంచరిస్తున్న కొందరి ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌ను సహించేదిలేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలోని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, వ్యాపార కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టారని అన్నారు.
బియ్యం లారీ బోల్తా
బియ్యం లారీ బోల్తా


