సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సోమవారం నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయండి. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను లింగంగుంట్లలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి నేడు తరలించనున్నాం. ఉదయం 10 గంటలకు నాయకులు, కార్యకర్తలు, అన్ని విభాగాల అధ్యక్షులు, పార్టీ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు జిల్లా కార్యాలయానికి చేరుకొని, అక్కడి నుంచి నిర్వహించే ర్యాలీలో భారీగా పాల్గొని విజయవంతం చేయండి. చంద్రబాబు సర్కారు తీరుపై వ్యతిరేకత చాటాలి.
– డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. దీన్ని కొనసాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసి పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది దశకు చేరింది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి నియోజకవర్గాల నుంచి సంతకాల పత్రాలు తరలించాం. నేడు జరగబోయే ర్యాలీ ద్వారా కేంద్ర కార్యాలయానికి పత్రాలు చేరనున్నాయి. జయపద్రం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజాసంఘాలు, సామాజిక వేత్తలను కోరుతున్నాం.
– విడదల రజిని, మాజీ మంత్రి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను నేడు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద, బడుగు బలహీన వర్గాల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణం. నేటి భారీ ర్యాలీని విజయవంతం చేయాలని గురజాల నియోజకవర్గంతోపాటు జిల్లా వైఎస్సార్‌సీపీ కుటుంబానికి ఆహ్వానిస్తున్నా. ప్రజాఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోలేదు.
– కాసు మహేష్‌రెడ్డి,
గురజాల మాజీ ఎమ్మెల్యే
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


