నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 25,607మందికి గాను 25,373మంది, ప్రైవేటు విద్యార్థులు 78మంది హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. విద్యార్థుల హాజరు 99శాతంగా నమోదైనట్టు ఆమె వివరించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నియమించిన 22 సిట్టింగ్, 13 ఫ్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను సందర్శించినట్టు తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి దూరవిద్య ఇంగ్లిష్ పరీక్షకు జిల్లాలోని 27 కేంద్రాల్లో 1,118మందికి గాను 977మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నకరికల్లు జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ నకరికల్లు, కారంపూడిలోని నాలుగు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులరెడ్డి సతైనపల్లి డివిజన్‌లోని ఆరు కేంద్రాలు, దూరవిద్య డైరెక్టర్ ఆర్.నరసింహారావు పట్టణంలోని ఐదు కేంద్రాలు, జాయింట్ డైరెక్టర్ ఎన్.గీత వినుకొండలోని 11 కేంద్రాలు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎన్.అక్బర్ అలీ గురజాలలోని రెండు కేంద్రాలను తనిఖీ చేశారు.
జిల్లాలో 99శాతం విద్యార్థుల హాజరు పరీక్షల నిర్వహణను పరిశీలించిన అధికారులు