నరసరావుపేట: తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, వెల్ఫేర్ ఆర్‌ఐ గోపీనాథ్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో...
నరసరావుపేట: రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి పేర్కొన్నారు. అమరజీవి జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్య నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రసాధన కోసం అమరజీవి చేసిన త్యాగం అజరామరం అని కొనియాడారు.
ఘనంగా నివాళులర్పించిన
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయం