ట్రిపుల్ ఐటీలో మంచి భవిష్యత్ ఉంటుంది. ఆసక్తి కలిగిన ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిర్ణీత గడువులో ఆర్జీయూకేటీ వెబ్‌సైట్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిలీవ్ నాటికి మంచి ప్లేస్‌మెంట్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ ప్రవేశాలు లభిస్తున్నాయి.
– అమరేంద్రకుమార్,
ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, శ్రీకాకుళం
కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ అడ్మిషన్లు చైర్మన్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్ డా.అమరేంద్రకుమార్ చండ్రా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ప్రవేశాల షెడ్యూల్ ఇలా..
దరఖాస్తులను మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు. జూన్ 12వ తేదీన ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ.. ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జూలై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో కలిసి చదువుకొనసాగించేలా ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.


