పర్లాకిమిడి: మహేంద్రతనయ నది ఒడ్డున ఉన్న బృందావన ప్యాలస్ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు రూ.44 లక్షల నిధులు మంజూరు చేసినట్లు జిల్లా టూరిజం అఽధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి సోమవారం తెలియజేశారు. ఈ నిధులను ఒడిశా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఓ. టి.డి.సి)కి పనులు అప్పగించడంతో ప్యాలస్ పను లు జోరందుకున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ పాలకు ల విలాస విడిదిగా నిలయమైన బృందావన్ ప్యాలస్‌లో అనేక ఒడియా చలనచిత్రాలు షూటింగ్‌లు జరిగాయి. ఇన్నాళ్లకు ఒడిషా టూరిజం శాఖ ఈ ప్యాలస్ మరమ్మతులకు శ్రద్ధ పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


