అడవులను రక్షించేందుకు యువకుల కృషి | - | Sakshi
Sakshi News home page

అడవులను రక్షించేందుకు యువకుల కృషి

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

అడవులను రక్షించేందుకు యువకుల కృషి

జయపురం: కార్చిచ్చు నుంచి అడవులను కాపాడుకొనేందుకు జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి గ్రామాలకు చెందిన యువకులు కృషి చేస్తున్నారు. ఇటీవల అరణ్యంలో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. వీటిని చూసిన వెంటనే గ్రామస్తులు వెళ్లి మంటలను అదుపు చేస్తున్నారు. బొయిపరిగు డ సమితి రామగిరి పంచాయితీ కుంభిఖార గ్రామ సమీపంలోని అడవులపై కలప అక్రమ రవాణా మాఫీయ కన్నుపడడంతో నిప్పు పెట్టి విలువైన చెట్లను కాల్చివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి బారినుంచి అడవులను రక్షించేందుకు మహిళలు, యువకులు, పురుషులు కాపుకాస్తున్నా రు. ఆ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో 50 హెక్టార్లలో అడవి ఉంది. ఆ అడవులను రక్షించుకొ నేందుకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ వేసవి కావడంతో తరచూ ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదివారం సా యంత్రం కుంభిఖారి గ్రామానికి కొంత దూరంలో అడవిలో మంటలు వ్యాపించడాన్ని చూసిన గ్రామస్తులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు.ఇలా సమితిలోని పలు ప్రాంతాలలో గ్రామస్తులు అడవుల పరిరక్షణకు ముందుకు వస్తున్నారని అటవీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement