రూ.25 వేల చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

రూ.25 వేల చెక్కు అందజేత

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

రూ.25 వేల చెక్కు అందజేత ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం గంజాయి రవాణా గుట్టురట్టు ● 2.8 టన్నుల గంజాయి పట్టివేత రైతులకు భూ పరిహారం పెంచాలి

పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి (స్వ యం ప్రతిపత్తి) కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్పుల కోసం పూర్వ విద్యార్థి, ప్రొఫెసర్‌ పరనందిబాబు (యు.ఎస్‌.ఎ.) రూ.25 వేల చెక్కును ప్రిన్సిపా ల్‌ రాధాకాంత భుయ్యాన్‌కు సోమవారం అందజేశారు. చెక్కు అందించిన వారిలో సీనియర్‌ న్యాయవాది వి.ఎస్‌.ఎన్‌.రాజు, టి.సీతారాం, మల్లా శ్రీను, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఉన్నారు.

పర్లాకిమిడి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇరదల వీధిలో గజపతి జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర్‌ శోబోరో, నృసింహా చరణ్‌ పట్నాయక్‌, సీనియర్‌ నాయకులు ఛిత్రి సింహాద్రి, కాశీనగర్‌ మండల అధ్యక్షుడు కోడూరు జీవన్‌రావు, ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు.

పర్లాకిమిడి: గంజాయ్‌ అక్రమ రవాణా గుట్టురట్టయింది. గజపతి జిల్లా మోహానా నియోజకవర్గం అడవ పంచాయతీలోని కరిగేజు ఏజెన్సీ లో సోమవారం వేకువజాము నుంచి పోలీసు లు, ఎకై ్సజ్‌ సిబ్బంది ముమ్మరంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 112 ప్లాస్టిక్‌ బ్యాగుల్లో భద్రపరిచిన గంజాయిని అడవుల్లో గమనించి స్వాధీనం చేసుకున్నారు. దీనిని మోహానా మేజిస్ట్రట్‌ ఆధ్వర్యంలోకాటా వేయగా 2,811 కిలోలు (2.8 టన్నులు) ఉన్నట్టు నిర్ధారించారు. దీని విలువ మార్కెట్‌లో రూ. 2.81 కోట్లకు పైగా ఉంటుందని ఆర్‌.ఉదయగిరి ఎస్‌డీపీవో రాకేష్‌కుమార్‌ సాహు తెలిపారు. ఈ ఘటనపై అడవ పోలీసుస్టేషన్‌ అధికారులు కేసునమోదు చేశారు.

జయపురం: జయపురం–నవరంగపూర్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తక్కువగా ఉందని.. ప్రస్తుత మార్కెట్‌ ధర మేరకు పరిహారం ఇవ్వాలని జయపురం సమి తి ధనపూర్‌ పంచాయతీ రైతులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం రైల్వే లైన్‌ ఏర్పాటులో భూములు కోల్పోతున్న 16 మంది రైతులు జిలిమిలిలోని ధనపూర్‌ రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 4.40 లక్షలుగా నిర్ణయించారని.. అయితే మార్కెట్‌లో ఎకరా రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఉందని వారు వెల్లడించారు. అందుచేత కనీసం ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఐదు రెట్లు పెంచాలని, భూములు ఇచ్చిన ప్రతి కుటుంబంలో ఒకరికి రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం కల్పించాలని కోరారు. రెవెన్యూ అధికారిని కలిసిన వారిలో రామ పాణిగ్రహి, ప్రహ్లాద్‌ తదితరులున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

టెక్కలి రూరల్‌: స్థానిక చిన్న బ్రాహ్మణ వీధి సమీప జాతీయ రహదారిపై సోమవారం ఒక కారు అదుపు తప్పి రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బరంపురం నుంచి నిక్కి మహాంతి తన కుమారుడు కేదార్‌ మహంతితో కలసి కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్‌ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారిపోవడంతో కారు రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement