భువనేశ్వర్:
దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న విశ్వ విద్యాల యాల వైస్ చాన్స్‌లర్ల నియామకం ప్రక్రియ పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబా బు కంభంపాటి ఆమోదం మేరకు ఈ నియామకా లు జరిగాయి. ఉత్కల్ విశ్వవిద్యాలయం, రెవెన్షా విశ్వవిద్యాలయం, ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం, ధరణీధర్ విశ్వవిద్యాలయం, గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయం, ఖల్లికోట యూనిటరీ విశ్వవిద్యాలయం, మధుసూదన్ లా విశ్వవిద్యాల యం, మా మణికేశ్వరి విశ్వవిద్యాలయం, మహా రా జా శ్రీరామ్ చంద్ర భంజ్ దేవ్ విశ్వవిద్యాలయం, రమా దేవి మహిళా విశ్వవిద్యాలయం, రాజేంద్ర విశ్వవిద్యాలయం, శ్రీ జగన్నాథ సంస్కృత విశ్వవిద్యాలయం, విక్రమ్‌దేవ్ విశ్వవిద్యాలయం మరి యు ఒడియా విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్ల ను గవర్నర్ నియమించారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్ల దార్శనికత మరియు మార్గదర్శకత్వంలో ఆయా విశ్వవిద్యాలయాలు విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో రాణించడం కొనసాగిస్తూ ఒడిశాలో ఉన్నత విద్య భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని చాన్స్‌లరు డాక్టరు హరి బాబు కంభంపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.


