పర్లాకిమిడి: ఒడిశా దివాస్ పక్షోత్సవాల సంద ర్భంగా సోమవారం ఉదయం బృందావన్ ప్యాలస్‌లో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. బృందావన్ ప్యాలస్ ఆవరణలో చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్‌ను తొలగించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నిర్మలాశె ఠి, జిల్లా టూరిజంశాఖ అధికారి అరుణ్‌కుమార్ త్రిపాఠి, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, ఎస్‌ఐ (పురపాలక) ఎన్.ధనేశ్వరరావు, జిల్లా సాంస్కృతికశాఖ అధికారి అర్చనా మంగరాజ్, 9వ వార్డు కౌన్సిలర్ నారాయణ బెహరా, పురపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ్ పహాడ్ వద్ద..
రాయగడ: మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వ ర్యంలో సొమవారం స్థానిక చెక్కాగుడ వద్ద గల ప్రేమ్ పహాడ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయ క్, కార్యనిర్వాహక అధికారి కులదీప్‌కుమార్ ఆధ్వర్యంలో పేమ్ పహాడ్ పరిసర ప్రాంతాల్లో గల చెత్తాచెదారాన్ని తొలగించారు. మున్సిపాలి టీ పరిధిలో గల వార్డుల కౌన్పిలర్‌లు, మున్సిపాలిటీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


