సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

కంచిలి: భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు గుజరాత్‌కి చెందిన మాతా సుమణి తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం కంచిలి హైవే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంచిలి రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) వారు మాతాసుమణి పాదయాత్ర జట్టుకు ఆహ్వానం పలికారు. శుక్రవారం రాత్రి కంచిలి ఊన శ్రీకాంత్‌ ఇంటి వద్ద బస చేసి శనివారం ఉదయం 4 గంటల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు తెలిపారు. దేశంలోని ప్రజలంతా ఐక్యంగా ఉంటూ హిందువులంతా ఒకే కుటుంబంలా సనాతన ధర్మం ఆచరించేలా మార్గదర్శం కల్పించేందుకు పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్‌ సోమనాథ్‌ ఆలయం వద్ద 2024 ఆగస్టు 23 వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 11 రాష్ట్రాల గుండా కొనసాగించానని అనంతరం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం పూరిని దర్శించుకొని పాదయాత్రను ముగించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement