ఫార్మసీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఫార్మసీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

లిఫ్ట్‌ ఇస్తామని సామూహిక అత్యాచారం

పర్లాకిమిడి: ఒడిశా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, బొల్లినేని మెడీస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆధ్వర్యంలో పేషెంట్‌ రిలేషన్స్‌ అసోసియేట్‌, వేర్‌హౌసింగ్‌ అసోసియేట్‌ (ఫార్మసీ) కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గజపతి జిల్లా ఉద్యోగ నియామక అధికారి స్మృతిరంజన్‌ త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నట్టు బొల్లినేని మెడీస్కిల్స్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు తెలియజేశారు. ఒడిశాలోని ఏ జిల్లాలకు చెందినవారైనా పీఆర్‌ఏ కోర్సులకు అర్హులన్నారు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాల కోసం 80088 89395, 799501 34220 నంబర్లను సంప్రదించాలన్నారు.

భార్య హత్య కేసులో..

భర్తకి యావజ్జీవ శిక్ష

రాయగడ: భార్యను గొంతునులిమి హత్య చేసిన కేసుకు సంబంధించి భర్తకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ గుణుపూర్‌ ఏడీజే దేవదత్త పట్నాయక్‌ సంచలన తీర్పునిచ్చారు. సోమవారం విచారణలోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించి తుది తీర్పును వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 ఏప్రిల్‌ 18వ తేదీన గుణుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గడియాఖల్‌ గ్రామానికి చెందిన సంతోషి బౌరిని ఆమె భర్త సురేంద్ర సొబొరొ గొంతునులిమి హత్య చేశాడు. దీనికి సంబంఽధించి గుణుపూర్‌ ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌లో సంతోషి బౌరి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు సురేంద్ర సొబొరొను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన ఏడీజే పట్నాయక్‌ ఈ మేరకు తీర్పునిచ్చారు.

పిడుగుపాటుకు యువకుడి మృతి

రాయగడ: పిడుగు పాటుకు యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక అంబాగుడ ప్రాంతానికి చెందిన జితు నాయక్‌ (19)గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సా యంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జితు నాయక్‌ తన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న మైదానానికి ఆడుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలొ పిడుగు పడటంతో అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు వెంటనే కుటుంబీకులకు సమా చారం అందించారు. అనంతరం జితును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు.

భువనేశ్వర్‌: లిఫ్ట్‌ ఇస్తామనే నెపంతో రాజధాని నగరంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనలో 2 మంది నిందితుల్ని స్థానిక కమిషనరేట్‌ పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. ఈ ఘటన టొమాండో పోలీస్‌ ఠాణా పరిధిలోని రొణొసింగ్‌పుర్‌లో జరిగింది. నయగఢ్‌ ప్రాంతానికి చెందిన బిచిత్ర సాహు, నారాయణ్‌ స్వంయిలను నిందితులుగా గుర్తించారు. ఇద్దరు నిందితులు ఆ మహిళకు లిఫ్ట్‌ ఇచ్చి దారి మళ్లించి ఆమెను ఒక అద్దె ఇంటికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమైపె అత్యాచారం చేశారని ఆరోపణ. భర్తతో గొడవపడి రోడ్డుపై ఒంటరిగా ఏడుస్తున్న బాధిత బెంగాలీ మహిళను ఇద్దరు నిందితులు చూశారు. ఆమెకు సహాయం చేస్తామని, రైల్వే స్టేషన్‌లో దింపుతామని మభ్య పెట్టి ఆమెను తమ అద్దె ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలియడంతో టొమాండో ఠాణా పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితుల ను అదుపులోకి తీసుకుని నిలదీశారు. ప్రాథమిక విచారణలో వీరివురు అంబులెన్స్‌ డ్రైవ ర్లుగా గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement