జయపురం: అడవుల పరిరక్షణపైన, వణ్య జంతువుల సంరక్షణపైన ప్రత్యేక దృష్టి సారించాల ని జయపురం అటవీ విడిజన్ అధికారికి జయపురం సమితిలో ప్రముఖ సమాజ సేవకుడు బి.హరిరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం జయ పురం అటవీ డివిజన్ అధికారిని కలిసి వినతిప త్రం అందజేశారు. నేను ఒక సామాన్య పౌరుడి ని అని, మా ప్రాంత అడవుల్లో జరుగుతున్న కొన్ని సమస్యలు, అక్రమాలు మీ దృష్టికి తీసుకురావాల్సి వస్తున్నందుకు విచారంగా ఉందన్నారు. ముఖ్యంగా అడవుల్లో అక్రమ చర్యలు పెరుగుతున్నాయన్నారు. అడవుల్లో చెట్లు విస్తృతంగా నరుకుతున్నా అటవీ విభాగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అడవులు తగ్గిపోతూ వన్య ప్రాణులకు ఆహార కొరత ఏర్పడ డంతో జనవాసాల్లోకి వస్తున్నాయన్నారు. పంటలకు నష్టం కల్పిస్తున్నామన్నారు. అడవులు తగ్గటం వలన పర్యావరణం ప్రభావితమై సమ తుల్యతకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా వెంకట్రామన్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఈవోగా శ్రీకాకుళంలో పనిచేస్తూ ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం కొద్దిరోజుల క్రితం బదిలీ అవ్వగా, తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళంలో నియమించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ఎంపీడీవోగా కూడా పనిచేశారు. మంగళవారం ఈయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదు ల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవె న్సు) కార్యక్రమంలో ప్రజల నుంచి 44 వినతు లు అందాయి. అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీని వాసరావు వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
రణస్థలం: లావేరు మండలంలో బొంతుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఇసుక టిప్పర్ లారీని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న డ్రైవర్ అబ్దుల్లా షేద్‌కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పోలీసులు, లావేరు పోలీసుల సాయంతో క్రేన్ సాయంతో క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. కాగా ఇసుక టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్యాబిన్‌లో ఇరుకుపోయిన డ్రైవర్ అబ్ధుల్లా షేద్‌ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడు. దీనిపై ఇంకా లావేరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.


