జయపురం: జయపురంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాగ్‌మార్చ్‌లో పోలీసు ఉన్నతాధికారులు, బీఎస్‌ఎఫ్, ఆర్మ్‌డ్ పోలీసు జవాన్లు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ సమస్యాపూరిత ప్రాంతాల్లో కూడా నిర్వహించారు. జయపురం పోలీసు స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ ప్రధాన మార్గాల మీదుగా దసర పొడియ మైదానానికి చేరుకుంది. శ్రీరామ నవమి ఉత్సవాల్లో పట్టణంలో శాంతి భధ్రలు పరిరక్షించటంలో ప్రజలు సహకరించాలని అధికారులు పిలుపు నిచ్చారు. ఈ ఫ్లాగ్ మార్చ్ అనంతరం జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో దక్షిణ ఒడిశా డీఐజీ కన్వర్ విశాల్ సింగ్ శ్రీరామ నవమి వేడుకల్లో శాంతి భధ్రతలపై సమీక్షించారు. శ్రీరామ నవమి ఉత్సవాల్లో శాంతిభధ్రతలు కాపాడేందుకు 13 ప్లాటూన్ల తోపాటు ట్రాఫిక్ పోలీసులను నియమించటం జరుగుతుందని ఎస్‌డీపీఓ పర్యవేక్షణలో వారుంటారని ఎస్పీ రోహిత్ వర్మ వెల్లడించారు.
రాయగడలో పెట్రోల్, డీజిల్ కొరత
రాయగడ: పట్టణంలో గల ఫిల్లింగ్ స్టేషన్‌లలో ఇంధనం దొరక్కపోవడంతో వినియోగదారులు నిరాశతో వెనుదిరిగారు. పెట్రెల్, డీజిల్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడే దిశకు చేరుకున్నాయి. జిల్లాలో దాదాపు 57 ఫిల్లింగ్ స్టేషన్‌లు ఉండగా ఇందులో దాదాపు 20 ఫిలింగ్ స్టేషన్లలో డీజిల్, పెట్రోల్ కొరత కనిపిస్తుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డీజిల్ కొరత కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అనేక లారీలు, భారీ వాహనాలు జిల్లాలోని గుణుపూర్ సమితిలోని జగన్నాథపూర్, రామనగుడ, కేదార్‌పూర్ తదితర ప్రాంతాల్లో నిలిచిపొయాయి. మరోవైపు తెరిచి ఉన్న పెట్రోల్ బంకులలో వినియోగదారుల రద్దీ కనిపిస్తుంది. పెట్రొల్, డీజిల్ లభించడం లేదన్న వదంతులు వస్తుండటందతో కొంత మంది ఇంధనాన్ని భారీ డ్రమ్ములు తదితరమైన వాటిలొ నింపి స్టోరేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో రాయగడ పట్టణంలో ఎలాంటి ఇంధన కొరత లేదని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న స్పష్టం చేశారు.
ప్రచార కార్యక్రమాలపై చర్చ
భువనేశ్వర్: ప్రచార కార్యక్రమాలుబలోపేతం చేసి ప్రజలకు తాజా సమాచారం సకాలంలో చేరదీయాలని రాష్ట్ర గవర్నర్‌కోరారు. లోక్ భవన్‌లో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటితో సంభాషించిన సందర్భంగా ఈ విషయం ప్రతిపాదించారు.


