పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని ఏడు సమితి కేంద్రాల్లో ఉన్న పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ కాయకల్ప్ అవార్డులను కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్‌లో గురువారం ప్రదానం చేశారు. జాతీయ నాణ్యత హామీ కమిటీ మరియు ధ్రువీకరణ పురస్కార సన్మాన వేడుక పురస్కరించుకొని అవార్డులను అందించారు. మొత్తం 67 ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న 33 మందికి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యవైద్యాధికారి, పీహెచ్‌వో డాక్టర్ సంతును పాఢి, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ మహాపాత్రో, అదనపు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డా.ఎం.ఎస్.మున్నీర్, డీపీఎం సునీతా మహాపాత్రో, ఏఎంక్యూఏ డాక్టర్ ప్రభుకుమార్ జెన్నా, పర్యవేక్షకులు ప్రాణ్ రంజన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


