పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలోని ఓపెన్ ఆడిటోరియంలో ట్రిపుల్‌ఈ శాఖ టెక్నికల్ టెస్ట్, ఈ–ఫ్లెయిర్‌ను ప్రొఫెసర్ ఎ.కె.పండా (ఐ.టీ. కన్సల్‌టెంట్ ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్) గురువారం ప్రారంభించారు. ట్రిఫుల్‌ఈ హెడ్ డాక్టర్ ప్రభాత్ కుమార్ పట్నాయక్ ముక్య వక్తగా వ్యవహరించారు. ఈ టెక్నికల్ టెస్ట్, ఈ–ఫ్లెయిర్‌లో కన్సల్‌టెంట్ సి.కె.వి.ప్రదీప్, రాకతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ (డీన్ అడ్మిన్) మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం ముఖ్యమని, అంకితభావంతో నూతన ఆవిష్కరణలు ప్రదర్శించాలన్నారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాజెక్టులు, సహకార అభ్యాసం ద్వారా అవశ్యకత పెరుగుతుందని డీన్ (వ్యవహారాలు) డాక్టర్ రితీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ (సోయెట్) డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా పాల్గొని నూతన ఆవిష్కరణలు, ప్రాడెక్టు డెవలప్‌మెంట్, రియల్ వరల్డ్ పొల్యూషన్స్‌పై మాట్లాడారు.


