జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ, జాతీయ ఆవిష్కార్ అభియాన్ పథకం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జయపురం విక్రమదేవ్ కాలేజ్ ప్రొఫెసర్ లోకేశ్ హాజరై ప్రదర్శనలను తిలకించారు. జిల్లాకు చెందిన జాతీయ బాల శాస్త్రవేత అవార్డు గ్రహీత, లలితా ఖీలో తన అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణను వేదికపై వినిపించి తోటి బాలలకు ప్రేరణనిచ్చారు. జిల్లాలోని 7 సమితులకు చెందిన మొత్తం 49 శాసీ్త్రయ ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో చోటు దక్కించుకున్నాయి. అందులో ఏడు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు సందీప్త కుమార్‌దాస్, సనాతన్‌దాస్, సంజీవ్‌కుమార్ వైద్య, దేవరాజ్ శేఠి, నిరంజన్ మహరణా, వాసుదేవ్ బెహరా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం


