బీఎస్పీలోకి జెడ్పీ మాజీ అధ్యక్షుడు గంగాధర్
రాయగడ: జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల బహుజన్ సమాజ్ పార్టీ తీర్థాన్ని తీసుకున్నారు. ఢిల్లీలోని ఆపార్టీ కార్యాలయంలో బీఎస్పీ అధినేత మాయావతి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో రాయగడ జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీజేడీలో కీలక పాత్ర పొషిస్తున్న గంగాధర్ పువ్వల గత సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కొద్ది నెలలు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బీఎస్పీలో చేరినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జితు జకసిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ కుమార్ నాయక్‌లు ఢిల్లీ వెళ్లి అధినేత్రి మాయావతితో గంగాధర్ పువ్వలను పరిచయం చేసిన అనంతరం పార్టీలో చేరినట్లు తెలిసింది. ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి తాను కృషిచేస్తానని ఈ సందర్భంగా పువ్వల తెలిపారు.
బీఎస్పీలోకి జెడ్పీ మాజీ అధ్యక్షుడు గంగాధర్


