పార్టీ బలోపేతమే లక్ష్యం
పర్లాకిమిడి: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, గజపతి జిల్లా ప్రభారిగా నియమించిన విశ్వేశ్వర టుడు అన్నారు. శుక్రవారం గజపతిజిల్లాలో పర్యటించారు. స్థానిక సర్క్యూట్ హౌస్‌లో సాక్షితో మాట్లాడుతూ.. గజపతి జిల్లాలో వచ్చే పంచాయతీ ఎన్నికలకు పార్టీ మండలాధ్యక్షులతో పార్టీ పటిష్టతపై సమీక్ష జరపనున్నట్టు తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (2024) జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తక్కువ మెజార్టీతో అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. వాటిపై కూడా చర్చించి తిరిగి జిల్లాలో పార్టీ పటిష్టతకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం ఆయన సవరకంజావీధిలో బీజేపీ కార్యాలయంలో మోహనా, పర్లాకిమిడి నియోజికవర్గాల మండలాధ్యక్షులతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబోరో, మోహనా అభ్యర్థి ప్రసన్న కుమార్ మల్లిక్, పార్టీ సాధారణ కార్యదర్శి జగన్నాఽథ మహాపాత్రో హాజరయ్యారు. విశ్వేశ్వర టుడును కోడూరు నారాయణ రావు సత్కరించారు. ఈ పార్టీ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గేదెల శ్రీధర్‌నాయుడు, ప్రశాంత్, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, మాజీ చైర్మన్ నృసింహా చరణ్ పట్నాయక్, పార్టీ మహిళా మోర్చా నాయకురాలు అరుణిమా సాహు తదితరులు పాల్గొన్నారు.


