కలెక్టరేట్‌లో గుడ్ గవర్నన్స్ వారోత్సవాలు
పర్లాకిమిడి: జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ‘గుడ్ గవర్నన్స్ వారోత్సవాలు’ను అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణి మఝి లాంఛనంగా ప్రారంభించారు. గుడ్ గవర్నన్స్ వీక్ డిసెంబర్ 1 నుంచి 25 వరకు కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల అభియోగాలు, వినతులు పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. సుశాసనం, గావ్‌కి ఆవుర్‌పై కలెక్టరేట్‌లో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మైథిలీ పాడీ, కశ్యప్ బెహరా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


