జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో నిరంతర అభివృద్ధి, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, మనకున్న 19 లక్ష్యాలు దీర్ఘకాలిక స్థాయిలో సాధించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ అన్నారు. స్థానిక జిల్లా పంచాయతీ రిసోర్సు భవనంలో దీర్ఘకాలిక అభివృద్ధిపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం ప్రారంభించారు. గౌరవ అతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి, తదిరులు హాజరయ్యారు. వికసిత భారత్, వికసిత్ ఒడిశాలో సుస్థిర వికాస్ సాధించడానికి ఆహార భఽద్రత, గ్రామస్థాయిలో పోషక ఆహారం, గుణాత్మక విద్య, ఉత్తమ ఆరోగ్య సేవలు, మహిళా స్వశక్తీకరణ, అసమానతలు తొలగించడం, అందరికీ తాగునీరు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాకాలు, వాయు, జలకాలుష్యం వల్ల జరిగే అనర్థాలను ఎదుర్కోవడంపై సి.డి.పి.ఓ.లు, బి.డి.ఓలకు అధికారులు ట్రైనింగ్ కల్పించారు. 2030లో వికసిత్ ఒడిశా దిశగా మన 17 లక్ష్యాలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ మునీంద్ర హనగ అధికారులను సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో ఆకాంక్ష బ్లాక్‌లు ఆర్.ఉదయగిరి, గుమ్మా బ్లాక్‌ల నుంచి కన్హూచరణ్ పాణిగ్రాహి, బప్పికిశోర్ దిగాల్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.


