వ్యాన్ బీభత్సం
● మూడు కార్లు, ఏడు బైకులు ధ్వంసం
కొరాపుట్: కొరాపుట్ ఆర్‌టీఓ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఐచర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు సాగింది. దీంతో రోడ్డుపై ఉన్న జనం భయాందోళనతో పరుగులు తీశారు. చివరకు వ్యాన్‌పై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నగదుతో వస్తున్న ఏటీఎం వ్యాన్ ఎగిరి రోడ్డుకి అడ్డంగా పడింది. అందులో అప్పటికే నిండుగా నగదు ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నగదును పోలీస్ వ్యాన్‌లో సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో మూడు కార్లు, ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. గాయపడిన పది మందిని ఆస్పత్రికి తరలించారు.
వ్యాన్ బీభత్సం
వ్యాన్ బీభత్సం


