ప్రశాంతంగా టెట్ పరీక్ష
పర్లాకిమిడి: రాష్ట్రవ్యాప్తంగా ఓటెట్ (ఒడిశా టీచర్స్ యోగ్యతా పరీక్ష) పరీక్ష 30 జిల్లాల్లో బుధవారం ప్రశాంతంగా ముగిసింది. గజపతి జిల్లాలోని పర్లాకిమిడి, మోహనాలో 16 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4,549 మంది పరీక్షలకు హాజరయ్యారు. పర్లాకిమిడిలోని మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, మహారాజా బాలికల ఉన్నత పాఠశాల, సెంచూరియన్ పబ్లిక్ స్కూల్, సరస్వతీ శిశు మందిర్, మహిళా కళాశాలల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. అన్ని కేంద్రాల్లో జిల్లా ముఖ్య విద్యాధికారి డా.మయాధర్ సాహు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఓటెట్ పరీక్ష పాసయ్యే విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక రాత పరీక్షకు అర్హులు.
పొగమంచుతో ఇబ్బందులు
పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. దీంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయఘడ బ్లాక్ మర్లబ ఘాటి, రామగిరి ఘాటి వద్ద బస్సులు ఎదురురెదుదుగా కనిపించకపోవడంతో పోలీసులు ఘాట్ సెక్షన్ల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ పొగమంచు మరో రెండు రోజులు ఉంటుందని, గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం బయటకు వెళ్లకపోవడమే మంచిదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
భారీగా గంజాయి పట్టివేత
జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ సమీపంలో జయపురం సదర్ పోలీసులు 195 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. పట్టుబడిన నిందితులు మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్ పరిధి ప్రధాన పూజారిగుడ గ్రామానికి చెందిన గోపీ బొడొనాయిక్, బొయిపరిగుడ పోలీసుస్టేషన్ పరిధి మఝిగుడకు చెందిన కృష్ణ గదబలుగా పేర్కొన్నారు. ఎస్‌ఐ ఏఆర్ సాగరియ నేతృత్వంలో పోలీసుల టీమ్ పాత్రోపుట్ ప్రాంతంలో వేకువజామున పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో ఒక నంబర్ లేని ట్రాక్టర్ పాత్రోపుట్ వైపు రావడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ట్రాక్టర్‌లో గంజాయిని గుర్తించారు. దీంతో ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసుని ఎస్‌ఐ శిరీష్ మహాపాత్రో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రశాంతంగా టెట్ పరీక్ష
ప్రశాంతంగా టెట్ పరీక్ష


