మల్కన్‌గిరి జిల్లాలో 8 ఓటీఈటీ పరీక్ష కేంద్రాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఓటీఈటీ పరీక్షకు మొత్తం 8 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2597 మంది హాజరయ్యారు. కటక్ మాధ్యమిక విద్యా మండలి వారి ఆదేశాలతో జిల్లా విద్యా శాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి నేతృత్వంలో పరీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి మాట్లాడుతూ మొదటి పేపర్ ఉదయం 8.30 నుంచి 11.00గంటల వరకు 3 కేంద్రాల్లో 746 మంది అభ్యర్థులకు నిర్వహించాల్సి ఉండగా, రెండోపేపర్ మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు 8 కేంద్రాల్లో 1851 మంది అభ్యర్థుల కోసం ఏర్పాటు చేశామన్నారు. మొదటి పేపర్‌కు 694 మంది హాజరయ్యారని, రెండో పేపర్‌కు 1772 మంది హాజరయ్యారని తెలపారు.
మహిళా సంఘ భవనం ప్రారంభం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ సీతాపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు స్మార్ట్ తరగతి గదుల భవనాన్ని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ప్రారంభించారు. అలాగే భూపతి లక్ష్మీపురం పంచాయతీ గోరిబంద గ్రామంలో మహిళ సంఘ్ అతిథి గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతిరావు, కాశీనగర్ సమితి చైర్‌పర్సన్ బల్ల శాయమ్మ, సర్పంచ్ తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి దూరంగా
దక్షణ ఒడిశా
రాయగడ: రాష్ట్రంలో దక్షిణ ఒడిశా అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉందని దండకారణ్య మంచ్ కన్వీనర్ గౌర చంద్ర త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమీపంలో బుధవారం మంచ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల విడదులైన జాతీయ స్థాయి నివేదికలో అవిభక్త కొరాపుట్ జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయన్నారు. అపారమైన ఖనిజ సంపదలు గల ఈ జిల్లాల్లో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం విచారకరమన్నారు. విద్య, వైద్య, మౌళిక వసతుల కల్పన వంటి రంగాల్లో బాగా వెనకబడిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. ఇటువంటి తరుణంలో అంతా సమాయత్తమై ప్రశ్నించాలని, అందుకు అనుగుణంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ తక్షణం సవతి తల్లి ప్రేమ ఒడిలో ఉందని, దీనిని వీడి అభివృద్ధికి కృషి చేయాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు గుప్తేశ్వర్ పాణిగ్రహి, కృష్ణకేశవ్ షడంగి, బాదల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరి జిల్లాలో 8 ఓటీఈటీ పరీక్ష కేంద్రాలు
మల్కన్‌గిరి జిల్లాలో 8 ఓటీఈటీ పరీక్ష కేంద్రాలు


