నృత్యోత్సవ వేడుక
సిక్కోలు వేదిక..
● రేపు బాపూజీ కళామందిర్‌లో
‘సప్తమీ నాట్యోత్సవం’
● ప్రదర్శనకు సిద్ధమైన ఐదుగురు
ప్రపంచస్థాయి కళాకారులు
● సంగీత గురు రఘునందన్‌కు లైఫ్‌టైం
అచీవ్‌మెంట్ అవార్డు
శ్రీకాకుళం కల్చరల్ : మరో మహత్తర వేడుకు సిక్కోలు సిద్ధమైంది. ఈ నెల 13న శ్రీకాకుళం నగరానికి చెందిన శివశ్రీ నృత్యకళానికేతన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఐదుగురు ప్రపంచస్థాయి కళాకారులు ‘సప్తమీ నాట్యోత్యోత్సవం’ పేరిట అద్భుత నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు సురేంద్రనాథ్(కూచిపూడి), బిజీనా సురేంద్రనాథ్(మోహినీయాట్టం), సౌరవ్‌రాయ్(కథక్), పరిమళ(భరతనాట్యం), ప్రీతీప్రియ(ఒడిస్సీ) ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం వీరికి శివశ్రీ నాట్య పురస్కరాలు ప్రదానం చేయనున్నారు.
నల్లాన్ చక్రవర్తుల రఘునందన్


