ఉత్సాహంగా నడక పోటీలు
రాయగడ: ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్థానిక కొరాపుట్ కూడలిలో సీనియర్ సిటిజన్ల మధ్య నడక పోటీలను నిర్వహించారు. 50 నుంచి 60 ఏళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారి మధ్య నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా 50 నుంచి 60 ఏళ్ల లోపు వారికి మధ్య జరిగిన పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో ప్రథమ బహుమతిని చిత్తరంజన్ రఽథ్, ద్వితీయ బహుమతిని బుద్దురాం మహాంతి, తృతీయ బహుమతిని హరీష్ చంద్ర సాహు సాధించారు. ప్రోత్సాహక బహుమతులను సుభాష్ చంద్రబారిక్, హరప్రసాద్ నల్ల సాధించారు. ఇదే కేటగీరీలో మహిళల మధ్య జరిగిన పోటీల్లో సుజాత మదల ప్రథమ బహుమతిని, సుజాత బారిక్ ద్వితీయ, సులుత ప్రధాన్ తృతీయ బహుమతులను పొందారు. 60 ఏళ్ల పైబడిన వారి మధ్య జరిగిన పోటీల్లో ట్రపతి పండా ప్రథమ బహుమతి, మహమ్మద్ అబ్దుల్ ఆలీజాన్ ద్వితీయ, సత్యానారాయణ మిశ్రో తృతీయ బహుమతిని సాధించారు. గుల్ల వేనకతారస్, డాక్టర్ బాబూరావు మహంతి ప్రోత్సాహక బహుమతులు పొందారు. విజేతలకు స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే జిల్లా స్థాయి చొయితీ ఉత్సవాల్లో బహుమతులను అందజేస్తామని క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ తెలియజేశారు.


