మాజీ మంత్రిని కలిసిన కోడూరు
పర్లాకిమిడి: కేంద్ర మాజీ మంత్రి బిశ్వేశ్వర్ తుడును ఒడిశాలోని గజపతి జిల్లా బీజేపీ ఇన్ చార్జిగా నియమించారు. ఆయనను భువనేశ్వర్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబో రో, మోహనా నియోజకవర్గ నాయకులు ప్రశాంత్ మల్లిక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. గజపతి జిల్లా పర్యటనకు ఆహ్వా నించారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్రిముఖ వ్యూహాంతో ఎలా పనిచేయాలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించాలని కోడూరు నారాయణరావు కోరారు.
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో గురువారం పశువైద్యం, జంతు సంరక్షణ నూతన విద్యార్థుల ఫ్రెషర్స్ డేను సీనియర్ విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆహ్వానం పలికారు. ‘వెటోరియా–2025’ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాళ్ విశ్వవిద్యాలయం యానిమల్ హజ్బెండరీ, వైస్‌చాన్సలర్ తీర్థ కుమార్‌దత్త ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. నూతన పశువైద్య విద్యార్థులకు వైట్‌కోట్ అందజేసి వారికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ బిశ్వజిత్ మిశ్రా, అజయ్ కుమార్‌నాయక్, రిజిస్ట్రార్ అనితా పాత్రో, వెటర్నరీ స్కూల్ డీన్ ఆర్.కె స్వయిని, డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, కోఆర్డినేటరు దంగే టి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సెంచూరియన్ వెటర్నరీ స్కూల్ పశు వైద్యశాలలో మేకలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహించారు.
ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధిలోని కాళింగ మన్నయ్యపేటలో సువ్వారి స్వామినాయుడు, కూన మోహనరావులకు చెందిన వరి కుప్పలకు బుధవారం అర్ధ రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిద య్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంట లను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 90 సెంట్లకు సంబంధించిన వరి కుప్పలు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కాలిపోవడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విష యం తెలుసుకున్న ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వరికుప్పలను పరిశీలించారు. అగ్నిమాపక అధికారి బొడ్డేపల్లి హరినారాయణ, వీఆర్వో ఇంద్ర పాల్గొన్నారు.
గత ఏడాది కూడా..
ఇదే గ్రామంలో గురుగుబెల్లి రాజశేఖర్ అనే రైతుకు చెందిన వరి కుప్పలను గత ఏడాది దగ్ధం చేశారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించ డంతో ఈ ఏడాది కూడా అదే మాదిరిగా వరికుప్పలను దగ్ధం చేశారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో చొక్కాకుల బంధ ఆక్రమణలు తొలగించడం వల్లే ఈ విధంగా వరికుప్పలను దగ్ధం చేస్తున్నారని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రణస్థలం: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు పైడిభీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో అఖిల భారత మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలి చిందన్నారు. దేశంలో వివిధ రంగాల కార్మికులను, సంఘాలను ఐక్యం చేసి బలమైన కార్మిక వర్గ పోరాటాలను నిర్మించేందుకు ఆర్.కె. బీచ్ లో జరిగే మహాసభలు దోహదపడతాయన్నా రు. సమావేశంలో కార్మికులు, అంగన్‌వాడీ, ఆశ,మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్క ర్స్ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెలమల రమణ, వెంప డాపు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రిని కలిసిన కోడూరు
మాజీ మంత్రిని కలిసిన కోడూరు


