మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని గొరఖ్‌పూర్‌లో విద్యుత్, సాగు, తాగునీరు, రహదారి వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పేరిట తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రాన్ని సమర్పించారు. అధికారులు స్పందించకపొతే తాము ఆందోళన బాట పడతామని అప్పట్లోనే హెచ్చరించారు. అయితే అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో మంగళవారం ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న టికిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆందోళన


