నిరుద్యోగ యువతకు వడ్డీ లేని రుణం
పర్లాకిమిడి: నిరుద్యోగ యువతీ యువకులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణం అందిస్తున్నామని టాటా స్పైన్ అసోసియేట్ మేనేజరు ప్రఫుల్ల కుమార్ సాహు అన్నారు. ఇప్పటివరకూ 29 మందికి లక్ష రూపాయల రుణం నానో యూనికార్న్ ద్వారా అందించినట్టు వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ హాల్–2లో నమో యూనికార్న్ అసెస్‌మెంట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నైపుణ్య శిక్షణ అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా తదితరులు హాజరయ్యారు. రెండవ విడత శిక్షణకు 11 మందిని ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధిపై అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున రుణం అందజేస్తామన్నారు. అభ్యుర్థులు కనీసం మెట్రిక్‌లేషన్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు.


