భువనేశ్వర్: మోంథా తీరం దాటనున్న నేపథ్యంలో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప.. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. తుఫాన్ ఉద్ధృతి నేపథ్యంలో 42 ట్రైన్లను రద్దు చేశారు. 2 రైళ్లను దారి మళ్లించారు. 5 రైళ్ల సేవలను పాక్షికంగా రద్దు చేశారు. మరో 8 రైళ్లను ఆలస్యంగా నడిపించారు. ముఖ్యమైన రైళ్లలో 11020 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం రద్దు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తాజా స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఖుర్దారోడ్ మండలంలోని పలాస, ఖుర్దారోడ్ మరియు భువనేశ్వర్‌లలో హెల్ప్ డెస్క్‌లను ప్రారంభించింది. వాల్తేర్ మండలంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ మరియు రాయగడ వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. అలాగే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.


